జవాన్ కుటుంబానికి పరామర్శ
ABN , First Publish Date - 2020-10-28T08:34:22+05:30 IST
అరుణాచల్‌ప్రదేశ్‌లో తీవ్రవాదులతో పోరాటంలో వీరమరణం చెందిన జవాన్ బొంగు బాబూరావు కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి డాక్టర్ కృష్ణారావు, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బి.శశిభూషణ్ పరామర్శించారు.

వజ్రపకొత్తూరు: అరుణాచల్‌ప్రదేశ్‌లో తీవ్రవాదులతో పోరాటంలో వీరమరణం చెందిన జవాన్ బొంగు బాబూరావు కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి డాక్టర్ కృష్ణారావు, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బి.శశిభూషణ్ పరామర్శించారు. మంగళవారం వజ్రపుకొత్తూరులో జవాన్ కుటుంబ సభ్యు లను కలిసి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి జవా న్ కుటుంబానికి ఆదుకోవాలని కోరారు. ఆయన భార్యకు గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు కారాటం శ్యాంసుందర రావు, బత్తిని భాస్కరరావు, కుత్తుం కృష్ణారావు, గోవిందరావు పాల్గొన్నారు.
వీర సైనికుడికి ఘన నివాళి
ఎల్.ఎన్.పేట: దేశ సరి హద్దుల్లో ఇటీవల ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన బి.బాబూరావుకు మం గళవారం ఘనంగా నివాళి అ ర్పించారు. లక్ష్మీనర్సుపేటలో రా ష్ట్ర దివ్యాంగుల ఉద్యోగ సం ఘం కార్యవర్గసభ్యుడు మన్మ థ కుమార్ మిశ్రో ఆధ్వర్యం లో గ్రామస్థులు, యువత బా బూరావు చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులువెలిగించి జోహార్ అర్పించారు. దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన బాబూరావు ఆత్మకు శాంతి కలగాలని, ఆయన త్యాగం మరువలేదనిదని అన్నారు. కార్యక్రమంలో అశోక్ పాణిగ్రాహి, సంజీవరావు, తిరు పతి పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.