రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం

ABN , First Publish Date - 2020-10-28T08:32:30+05:30 IST

వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో మంగళవారం జమచేయడం జరిగిం దని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.

రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం

రాజాం, అక్టోబరు 27: వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో మంగళవారం జమచేయడం జరిగిం దని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. మంగళవారం బొద్దాం రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గం లో 39,077 మంది రైతులకు రూ,15.83 కోట్లు జమచేసినట్లు చెప్పారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.4 వేలు చొప్పున వేశామన్నారు. రాజాం మం డలంలో 9,005 మందికి, రేగిడిలో 11,889, సంతకవిటిలో 12,129, వంగ రలో 5,955 మందికి అంద జేశామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సీహెచ్‌ వెంకటరావు, ఏవో ఎం.రేణుకాసాయి తదితరులు పాల్గొన్నారు.


సమస్యలు పరిష్కరించాలని వినతి

రాజాం: ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్‌ నాయకులు ఎమ్మెల్యే జోగులును కోరారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో యూటీఎఫ్‌ నాయకులు పక్కి వాసు ,రెడ్డి మోహన్‌రావు, బి గౌరిశంకర్‌, కురిటి బాలమురళీకృష్ణ వినతిపత్రం అందించారు. జీఓ నెంబర్లు 53, 54 సవరించేలా చర్యలు తీసుకోవాలని, ఫిబ్రవరి 2020 బదులు అక్టోబరు 17 నాటి రోల్‌ ఆధారంగా నోషనైలేజేషన్‌ చేపట్టాలని, అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.  అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Updated Date - 2020-10-28T08:32:30+05:30 IST