43 సంఘాలకు అందని వైఎస్‌ఆర్‌ ఆసరా

ABN , First Publish Date - 2020-10-28T08:28:22+05:30 IST

జంట పట్టణాల్లో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద నగదు అందకపోవడంతో 430 మంది మహిళలు ఆందోళనకు దిగారు.

43 సంఘాలకు అందని వైఎస్‌ఆర్‌ ఆసరా

 మునిసిపల్‌ కమిషనర్‌కు ఎస్‌హెచ్‌జీల ఫిర్యాదు


పలాస: జంట పట్టణాల్లో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద నగదు అందకపోవడంతో 430 మంది మహిళలు ఆందోళనకు దిగారు. ఈ మేర కు మునిసిపల్‌ కమిషనర్‌ నారాయణరావుకు ఫిర్యాదు చేశా రు. పలాస లోని పురుషోత్తపురం,  ఎస్సీ వీధి, సీతారామ్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన 43 పొదుపు సంఘాలు సమాఖ్యగా ఏర్పడ్డాయి. విఘ్నేశ్వర, శ్రీదేవి, పార్వ తి, గంగాభవాని, కౌసల్య, అన్నపూర్ణ, సతీ సావిత్రి  మహిళా సం ఘాల్లో ఒక్కో సంఘం నుంచి 10 మంది చొప్పున మహిళలు పొదుపు ఖాతాలు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలకు కూడా వీరు అర్హత సాధించి వాటి తో ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద నగదు జమ చేసింది. తాము కూడా ఈ పథకానికి అర్హత పొందుతామని మహిళలం తా భావించారు. 


బ్యాంకుల వద్దకు వెళ్తే సమాఖ్య తీర్మానం లేకుండా డ బ్బులు ఇవ్వబోమని చెప్పడంతో మునిసిపల్‌ కార్యాలయాన్ని సంప్రదిం చారు.  2010  నుంచి సమైక్యకు చెల్లిస్తున్న రూ.10 నగదు జమ కాలేదు.  ఈ మేరకు రూ.4 లక్షల నగదు సమాక్యకు జమకావల్సి ఉంది. ఈ విష యంపై మహిళలు ఆర్పీని ప్రశ్నిస్తున్నా సమాధానం రాకపోవడంతో కమి షనర్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్పీ కమలను పిలి పించి విచారించారు. అయితే తాము నిబంధనల ప్రకారం ఇతర సం ఘాలకు వడ్డీకి ఇచ్చానని, అయితే వారు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ స్వప్న వివరించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు తక్షణం ఇస్తామని, మూడు రోజుల్లో సమాఖ్యకు చెల్లించాల్సిన డబ్బులు బ్యాంకులో జమచేయాలని కమిషనర్‌ ఆదేశాలు ఇవ్వడంతో మహిళలు శాంతించారు.  

Updated Date - 2020-10-28T08:28:22+05:30 IST