ఐక్యత కోరుతూ పరుగు
ABN , First Publish Date - 2020-10-27T09:41:10+05:30 IST
పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఐక్యత కోరుతూ పరుగు కార్యక్రమాన్ని ఎస్పీ అమిత్ బర్దర్ సోమవారం ప్రారంభించారు.

రన్ ఫర్ యూనిటీని ప్రారంభించిన ఎస్పీ అమిత్బర్దర్
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 26: పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఐక్యత కోరుతూ పరుగు కార్యక్రమాన్ని ఎస్పీ అమిత్ బర్దర్ సోమవారం ప్రారంభించారు. ప్రజలు, యువత, పోలీసులు ప్రత్యేక టీషర్టులను ధరించి పరుగులో పాల్గొన్నారు. ఏడు రోడ్ల జంక్షన్ నుంచి కృష్ణాపార్క్, పాలకొండ రోడ్, డేఅండ్నైట్, అంబేద్కర్ కూడలి మీదుగా జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం డీపీవో కార్యాలయం వద్ద పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. ప్రజా రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ ఐక్యతా పరుగును నిర్వహించినట్లు తెలిపారు. వీరుల త్యా గాలకు గుర్తుగా అందరం ఐక్యతతో బలమైన జాతి నిర్మాణం చేపట్టాలన్నా రు. కార్యక్రమంలో ఏఎస్పీ సోమశేఖర్, డీఎస్పీలు మూర్తి, శేఖర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.