240 మద్యం సీసాలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-10-13T08:10:30+05:30 IST

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 240 మద్యం సీసాలను రణస్థలం ఎక్సైజ్‌ ఎస్‌ఐ బంగార్రాజు, ఇంటలిజెన్స్‌ ఎస్‌ఐ వై.చంద్రమోహన్‌ స్వాధీనం చేసుకున్నారు.

240 మద్యం సీసాలు స్వాధీనం

రణస్థలం/ఆమదాలవలస : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 240 మద్యం సీసాలను  రణస్థలం ఎక్సైజ్‌ ఎస్‌ఐ బంగార్రాజు, ఇంటలిజెన్స్‌ ఎస్‌ఐ వై.చంద్రమోహన్‌ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పైడిభీమవరం పెట్రోల్‌ బంకు సమీపాన తనిఖీలు నిర్వహిస్తుండగా బి.వెంకట జయలక్ష్మణమూర్తి, టి.లక్ష్మునాయు డు, ఎం.వెంకటరాజేష్‌ ద్విచక్రవాహనంపై వీటిని తరలిస్తుండగా పట్టుపబడినట్టు చెప్పారు. ఈమేరకు వారిపై కేసు నమోదు చేసినట్టు వారు తెలిపారు.


 కొత్తూరు : మెట్టూరులో అక్రమంగా తరలిస్తున్న 105 ఒడిశా మద్యం సీసాలను  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌మహేశ్వరి స్వాధీనంచేసుకున్నారు. పాడ లికి చెందిన గొర్లె శంకరరావు ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా పట్టుకొని వాటిని సీజ్‌ చేశారు. దాడుల్లో హెచ్‌సీ ప్రభాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


 ఇచ్ఛాపురం : ఇద్దర్ని అరెస్టుచేసి 23 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ  ఇన్‌స్పెక్టర్‌ జనార్దనరావు తెలిపారు. ఒడిశా నుంచి ఇచ్ఛాపురం మీదుగా ఈదుపురం, కవిటి మద్యం తరలిస్తుండగా పట్టుబడ్డారని చెప్పారు.


 పాతపట్నం : ఒడిశా నుంచి మద్యం రవాణాకు పాల్పడుతుండగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ అహమ్మద్‌ అమీర్‌ఆలీ తెలిపారు. కొరసవాడ కు చెందిన గుడియ మోహనరావును అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 42 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

Updated Date - 2020-10-13T08:10:30+05:30 IST