-
-
Home » Andhra Pradesh » Srikakulam » sklm news
-
దేవాలయాల పరిరక్షణకు శాంతి కమిటీలు
ABN , First Publish Date - 2020-10-07T10:10:00+05:30 IST
మండలంలోని దేవాలయాలు పరిరక్షణకు శాంతి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై.కృష్ణ తెలిపారు.

శ్రీముఖలింగం (జలుమూరు), అక్టోబరు 6: మండలంలోని దేవాలయాలు పరిరక్షణకు శాంతి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై.కృష్ణ తెలిపారు. శ్రీముఖలింగం దేవాలయానికి 11 మంది సభ్యులతో శాంతి కమిటీ ఏర్పాటుకు మంగళవారం గ్రామస్థులు, అర్చకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు, చర్చిలు, మసీదులున్న గ్రామాల్లో మతపరమైన సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీముఖలింగం, జలుమూరు, పాగోడు, కరవంజ, చల్లవానిపేట గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఆలయాల్లో రక్షణ చర్యలు
హిరమండలం: ఇటీవల కాలంలో ఆలయాల్లో వరుస ఘటనల నేపథ్యంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని పాతపట్నం సీఐ రవి ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం హిరమండలం గణపతి ఆలయం, సాయిబాబా మందిరం, నీలమణి దుర్గ ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.