యథేచ్ఛగా జీడిపప్పు రవాణా
ABN , First Publish Date - 2020-10-04T10:26:00+05:30 IST
ప్రైవేటు బస్సుల్లో యథేచ్ఛగా జీడిపప్పు రవాణా అవుతోంది. లాక్‌డౌన్ అనంతరం అనుమతులు ఇవ్వకపోయినా ప్రైవేటు ట్రావెల్స్ రోడ్డెక్కుతున్నాయి.
బిల్లులు చెల్లించని వైనం..
ప్రభుత్వ ఆదాయానికి గండి
ప్రైవేటు బస్సులపై అధికారుల పర్యవేక్షణ శూన్యం
పలాస, అక్టోబరు 3: ప్రైవేటు బస్సుల్లో యథేచ్ఛగా జీడిపప్పు రవాణా అవుతోంది. లాక్‌డౌన్ అనంతరం అనుమతులు ఇవ్వకపోయినా ప్రైవేటు ట్రావెల్స్ రోడ్డెక్కుతున్నాయి. ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికులకు బదులు ఎటు వంటి బిల్లుల్లేని జీడి పప్పును రవాణా చేస్తున్నారు. ని బంధనలకు విరుద్ధంగా కార్గో రవాణా చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై అధికారులు కన్నెత్తిచూడడంలేదు. పలాస-కాశీబుగ్గ జంట పట్ట ణాల్లో లాక్‌డౌన్ అనంతరం జీడి పరిశ్రమలపై ఆంక్షలు ఎత్తి వేశారు. అయితే నిబంధనలకు లోబడి ఆర్టీసీ కార్గో సర్వీసు, ప్రైవేటు ట్రాన్స్ పోర్టు ద్వారా జీడి పప్పును ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
ఇందులో తరలించడానికి బిల్లు లు తప్పనిసరిగా ఉండాలి. ప్రైవేటు బస్సుల్లో జీడి పప్పును ఎటువంటి బిల్లులు లేకుండా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. జీడి పప్పు బాక్సుకు రూ. 100 ఇస్తే ఎంతదూరమైనా ప్రైవేటు బస్సుల్లో జీడి పప్పును తరలిస్తుండడం విశేషం. వాస్తవానికి ప్రైవేటు బస్సులకు ఈ ప్రాంతంలో ఇంకా అనుమతి ఇవ్వ లేదు. కానీ కేవలం జీడి పప్పు డబ్బాలను తరలించడానికి మాత్రమే ప్రైవేటు బస్సులు తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రైవేటు బస్సులు కేవలం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి మాత్రమే అను మతి ఉంటుంది.
నిబంధనలకు విరుద్ధంగా కార్గో రవాణాకు సైతం బస్సులను వినియోగిస్తున్నారు. ఈ విషయంపై మో టారు ట్రాన్స్‌పోర్టు, పోలీసులు, వాణిజ్య పన్నులు, ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలొస్తున్నాయి. జీడిపప్పు డబ్బాలను కోసంగిపురం కూడలి వద్దకు తరలిం చి, అక్కడ ప్రైవేటు బస్సుల్లో ఎక్కించి ఇతర దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు.