కృష్ణానగర్‌లో చోరీ

ABN , First Publish Date - 2020-10-03T10:33:01+05:30 IST

శ్రీకాకుళం రూరల్‌ మండల పరిధి శ్రీకృష్ణా నగర్‌లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

కృష్ణానగర్‌లో చోరీ

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: శ్రీకాకుళం రూరల్‌ మండల పరిధి శ్రీకృష్ణా నగర్‌లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. రెండో లేఔట్‌లో నివాసముంటున్న చర్చి పాస్టర్‌ కె.ప్రతాప్‌రాజు అనారోగ్యం కారణంగా గురువారం సాయంత్రం ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా విశాఖపట్నం  వెళ్లారు. దీంతో దొంగలు అర్ధరాత్రి ఇంటి తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశిం చారు. బీరువా తలుపులను విరగ్గొట్టి రూ.లక్ష నగదు, తులంన్నర బంగారు ఆభరణాలను దొంగిలించారు.


శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన ప్రతాప్‌రాజు చోరీ జరిగినట్లు గుర్తించి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీం, సీఐ అంబేద్కర్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు  ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు. 

Updated Date - 2020-10-03T10:33:01+05:30 IST