‘రవికుమార్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం’

ABN , First Publish Date - 2020-10-02T09:00:38+05:30 IST

రెల్లిగెడ్డ పనుల్లో రూ.11 కోట్ల అవినీతిని ప్రోత్సహించిన టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ నీతి, నిజాయితీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధానకార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్‌ అన్నారు.

‘రవికుమార్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం’

పొందూరు: రెల్లిగెడ్డ పనుల్లో రూ.11 కోట్ల అవినీతిని ప్రోత్సహించిన టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ నీతి, నిజాయితీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధానకార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్‌  అన్నారు. గురువారం  పొందూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుడ్ల మోహన్‌ భవనాన్ని ఆక్రమిం చుకున్న రవికుమార్‌ వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రచారం చేయడం తగదన్నారు.


  నిధులు విడుదల చేయకుండానే రాజకీయ లబ్ధికోసమే తండ్యాం ఎత్తిపోతల పఽథకానికి శంకుస్థాపన చేశారని, ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రవికుమార్‌కు సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పి.రమణమూర్తి, లోలుగు శ్రీరాములనాయుడు, లోలుగు కాంతారావు, పార్టీ మండలాధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, ఏఎంసీ చైర్మన్‌ బి.సునీల్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు గండ్యాడ రమేష్‌, గుడ్ల మోహన్‌, గాడు నాగరాజు పాల్గొన్నారు

Updated Date - 2020-10-02T09:00:38+05:30 IST