1,900 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
ABN , First Publish Date - 2020-09-27T11:02:19+05:30 IST
మండలంలోని నువాగడ కాలనీ సమీప కొండప్రాంతంలో శనివారం 1,900 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ అధికారి ఎస్.
కంచిలి: మండలంలోని నువాగడ కాలనీ సమీప కొండప్రాంతంలో శనివారం 1,900 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ అధికారి ఎస్.ధర్మారావు తెలిపారు. సిబ్బందితో కలిసి దాడిచేయగా, ప్లాస్టిక్ డ్రమ్ములలో బెల్లం ఊట కనిపించిందని చెప్పారు. స్వాఽధీనం చేసుకున్న ఊట ఎవరిదనేది తెలియరాలేదని తెలిపారు.
అలాగే ఎక్కల-అర్జునాపురం గ్రామసమీపంలో 400 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని తరలిస్తున్న ఆర్.శివప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఒడిశాలోని మున్సబ్పేటలో దుకాణం నుంచి ప్యాకెట్లు తీసుకువస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.