పరీక్ష కాలం

ABN , First Publish Date - 2020-03-02T10:26:22+05:30 IST

పరీక్ష కాలం

పరీక్ష కాలం

సమీపిస్తున్న   పదో తరగతి పరీక్షలు

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత

సచివాలయ ఉద్యోగాలతో  సీఆర్టీలు ఖాళీ

విద్యాబోధనపై ప్రభావం

శాతశాతం ఉత్తీర్ణతపై  అనుమానం 


(సీతంపేట)

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. మరో మూడు వారాల వ్య వధే ఉంది. పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తు న్నారు. సీసీ కెమెరాల నడుమ పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవు తున్నారు. మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పక్కాగా నిర్వహిం చనున్నట్టు చెబుతున్నారు. ఏ పరీక్షా కేంద్రంలోనైనా మాస్‌ కాపీయింగ్‌ జరిగితే ఇట్టే తెలిసేలా సాంకేతిక సేవలు అందుబాటులోకి తెచ్చారు. మాస్‌కాపీయింగ్‌ జరిగినట్టు తేలితే వెంటనే సంబంధిత ఇన్విజలేటర్‌ పై వేటు పడనుంది. కఠినచర్యలు మంచిదే అయినా ఐటీడీఏ పరిధిలోని సంక్షేమ పాఠశాలల్లో సమస్యలు మూలంగా ఆశించినస్థాయిలో బోధన సాగడం లేదు. ఫలితంగా ఆ ప్రభావం పదో తరగతి ఉత్తీర్ణతశాతంపై పడే అవకాశముందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 


సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఈ ఏడాది 1774 మంది గిరిజన విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 19 పరిక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు.  కేంద్రాల్లో విద్యాశాఖ ఏర్పాటుచేసిన ఇన్విజిలేటర్లతో పాటు ఐటీడీఏ ఆధ్వర్యంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.. మాస్‌ కాపీయింగ్‌కు తావు లేకుండా నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షించనున్నాయి. కాగా ఈ ఏడాది ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులు 194 మందిని గుర్తించారు.   వీరందర్నీ ఎంపిక చేసి ప్రత్యేకంగా ఆరు కేంద్రాలను ఏర్పాటుచేసి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తోంది. దీంతో సీఆర్టీల నియామకంతో నెట్టుకొస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో 229 సీఆర్టీలు పనిచేస్తుండగా.. వీరిలో 92 మంది సబ్జెక్టు టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెల ల కిందట కొంతమంది సచివా లయ ఉద్యోగాలకు ఎంపికయ్యా రు.  అప్పటి నుంచి సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడి బోధనపై పడింది. దీనికితోడు ఈ ఏడాది బిట్‌ స్థానంలో 2 మార్కుల ప్రశ్నలను అమలు చేస్తున్నారు. ఇది విద్యార్థులకు కఠినతరమని భావిస్తున్నారు. ప్రస్తుతం వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా శతశాతం ఉత్తీర్ణతపై ఓకింత ఆందోళన నెలకొంది.  


పాఠశాలల వివరాలు

చిన్నకోష్టా, బుడంబో, కిల్లోయి, పట్టు లోగాం, ఎస్‌ఎల్‌పురం, పెద్దమడి, పీఎల్‌పురం, బందపల్లి, జయపురం, భీంపురం, నేలబొంతు, బొమ్మిక, లాబర, బైదిలాపురం, సవరబొంతు, వెన్నెలవ లస, ఒండ్రుజ్వాల, లబ్బ, చిన్నబగ్గ, హడ్డుబంగి, శ్రీకాకుళం, గంగమ్మపేట, మల్లి, శంభాం, దోనుభాయి, పొల్ల, సామరిల్లు, సీతంపేటలో రెండు గిరిజ న ఆశ్రమ పాఠశాలలున్నాయి.


ప్రత్యేకంగా దృష్టిసారించాం

పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యా ర్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. శతశా తం ఉత్తీర్ణతకు కృషిచేస్తున్నాం. ఇప్పటికే వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. 

-కమల, ఐటీడీఏ ఉప సంచాలకులు, సీతంపేట

Updated Date - 2020-03-02T10:26:22+05:30 IST