రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు
ABN , First Publish Date - 2020-03-02T10:11:35+05:30 IST
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు

శ్రీకాకుళం స్పోర్ట్స్ (గుజరాతీపేట), మార్చి 1: విజయనగరం జిల్లా చీపు రుపల్లిలో ఆదివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు జిల్లా మహిళా జట్టు హాజరయ్యింది. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు చురుగ్గా పాల్గొంటున్నారని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ వెంకన్నచౌదరి, కార్యదర్శి అకేని చిరంజీవిరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.రాజారావులు తెలిపారు. కోచ్‌గా పి.ఝాన్సీ, మేనేజర్‌గా బి.రామకృష్ణ, టెక్నికల్ అఫీసియల్‌గా ఆర్.అప్పలస్వామిలు వ్యవహరిస్తున్నారు.