జిల్లా హిందీ పండిట్లకు సీనియార్టీ కల్పించకపోవడం శోచనీయం
ABN , First Publish Date - 2020-03-02T10:09:46+05:30 IST
జిల్లా హిందీ పండిట్లకు సీనియార్టీ కల్పించకపోవడం శోచనీయం

గుజరాతీపేట, మార్చి 1: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2002-డీఎస్సీ హిందీ పండిట్లకు నోషనల్ సీనియార్టీ కల్పించి శ్రీకాకుళం జిల్లా హిందీ పండిట్లను విస్మ రించడం శోచనీయమని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా శాఖ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు కె.అప్పలరాజు, పి.కృష్ణారావులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డీటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2003-డీఎస్సీ అభ్యర్థులతో పాటుగా 2002-డీఎస్సీ హిందీ పండిట్లగా ఉద్యోగంలో చేరిన అభ్యర్థులను సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశా రు. సీతంపేట ఐటీడీఏలో ఖాళీగా ఉన్న పీజీహెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలకు పదోన్నతలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావే శంలో రాష్ట్ర కౌన్సిలర్ కోత ధర్మారావు, జిల్లా బాఽధ్యులు జి.గోపాలరావు, జి.భాస్కర రావు, పి.హరిప్రసన్న, ఎస్.సత్యనారాయణ, బి.రమణకుమారి పాల్గొన్నారు.