మహిళ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-03-02T10:09:23+05:30 IST

మహిళ అనుమానాస్పద మృతి

మహిళ అనుమానాస్పద మృతి

హడావుడిగా మృతదేహం  పూడ్చివేత

హత్య చేసినట్లు అనుమానాలు

ఎలాంటి సమాచారం లేదన్న పోలీసులు


గెడ్డూరు(హరిపురం) మార్చి1: మందస మండలం దున్నూరు పంచాయతీ గెడ్డూరు గ్రామంలో పిచ్చుక పోలమ్మ(50) అనే మహిళ ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంటిలోనే ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకు న్నట్లు కుటుంబ సభ్యులు చెబుతుండగా.. కుటుంబ కలహాలతో ఆమెను హత్య చేసినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. పోలమ్మకు ముగ్గురు కుమారులు ఉన్నా రు. పెద్ద కుమారుడు పిచ్చుక రాజు, ఆయన భార్య సుశీల, పిల్లలతో కలిసి పోల మ్మ ఉంటుంది. రెండో కుమారుడు ఆనంద్‌ వరంగల్‌లో ఉద్యోగం చేస్తోన్నాడు. ఎర్రముక్కాంలో భార్యతో కలసి నివాసముంటున్నాడు. చిన్నకుమారుడు అండమాన్‌లో ఉంటున్నాడు. కాగా, కుటుంబంలో వివాహేతర సంబంధాలే పోలమ్మ మృతికి కారణంగా అనుమానిస్తున్నారు. ఇటీవల అన్నదమ్ములు ఈ  వివాహేతర సంబంధంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకొని రాజీ పడ్డారు. ఈ నేపథ్యంలో పోలమ్మ హఠాన్మరణం చెందింది. అయితే, చిన్నకుమారుడికి తెలియకుండానే ఆమె మృతదేహాన్ని హడావుడిగా పూడ్చివేయడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సైతం గ్రామాన్ని సందర్శించి ప్రేక్షక పాత్ర వహించడంతో అనుమానులు తలెత్తుతున్నాయి. ఇదే విషయమై మందస ఎస్‌ఐ ప్రసాదరావును అడగ్గా తాను సెలవులో ఉన్నట్లు చెప్పారు. పోలీసులను అడిగితే తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

Updated Date - 2020-03-02T10:09:23+05:30 IST