ఆర్థిక ప్రోత్సాహం లేక.. కల సాకారం కాక

ABN , First Publish Date - 2020-03-02T10:08:54+05:30 IST

ఆర్థిక ప్రోత్సాహం లేక.. కల సాకారం కాక

ఆర్థిక ప్రోత్సాహం లేక.. కల సాకారం కాక

ఎవరెస్ట్‌ పర్వతారోహణకు ఉవ్విళ్లూరుతున్న గిరిజన యువకులు  

వెనక్కులాగుతున్న ఆర్థిక ఇబ్బందులు  

గవర్నర్‌ కోటా నుంచి నిధుల ఇవ్వాలని వేడుకోలు


(సీతంపేట)

ఇప్పటికే ఆ యువకులు కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు. ఇప్పుడు ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, ఆర్థిక ఇబ్బందులు వారిని వెనక్కులాగేస్తున్నాయి.  ఎలాగైనా ఎత్తైన ఎవరెస్టును అధిరోహించి జాతీయ జెండాను రెపరెపలాడిం చాలన్నది వారి బలమైన కోరిక.  అందుకే ఆర్థిక సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట మండలం నారాయణగూడకు చెందిన సవర భుజంగరావు, కొత్తూరు మండలానికి చెందిన దేవుదల ఢిల్లేశ్వరరావులకు పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. గతంలో ఆఫ్రికా దేశంలోనే ఎత్తైన టాంజానీయాలో ఉన్న కిలిమంజారో పర్వత శిఖరాన్ని అవలీలగా ఎక్కి ఔరా! అనిపించా రు. వీరికి అప్పట్లో ఐటీడీఏ ఆర్థిక సాయాన్ని అందించింది. భుజంగ రావుకు రూ.2 లక్షలు, ఢిల్లేశ్వరరా వుకు రూ.6లక్షలు సమకూర్చ డంతో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఇప్పుడు ఎవరె స్టు శిఖరం ఎక్కేందుకు ఆసక్తి ఉన్నా ఆర్థిక సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి లక్షల రూపాయలు అవ సరం కావడంతో ఐటీడీఏను ఆశ్ర యించారు. అయితే, అంత సమకూర్చలేమని, నిధులు కూడా లేవని అధికారులు తేల్చి చెప్ప డంతో వారి ఆశలు అడియాశల య్యాయి. ఎవరెస్టు శిఖరం ఎక్కా లనే తమకు తపన ఉందని, దానికి రూ 20 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుంద ని భుజంగరావు,  ఢిల్లేశ్వరరావులు చెబుతున్నారు. అంత ఆర్థిక స్థోమత తమకు లేదని, గవర్నర్‌ కోటా నిధుల నుంచి తమకు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు.  ఆర్థిక ప్రోత్సాహమిస్తే  ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ఐటీడీఏకు మంచి పేరు తీసుకువస్తామని చెబుతున్నారు. కాగా, సవర భుజంగరావుకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ గ్రామ యువకులు, ప్రజలు గ్రామంలో బ్యాన ర్లను ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-03-02T10:08:54+05:30 IST