రోడ్డు ప్రమాదంలో పూజారికి గాయాలు

ABN , First Publish Date - 2020-03-02T10:07:17+05:30 IST

రోడ్డు ప్రమాదంలో పూజారికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో పూజారికి గాయాలు

పొందూరు, మార్చి 1: రాపాక కూడలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఇల్లయ్యగారిపేటకు చెందిన పూజారి మావూరి ప్రసాదరావు తీవ్రంగా గాయ పడ్డాడు. ద్విచక్ర వాహనంపై పొందూరుకు బయలుదేరిన ఆయన రాపాక జంక్షన్‌ వద్ద ఆగాడు. అక్కడ బైక్‌ దిగి నడుచుకొని వెళ్తుండగా ఆప్కో ఇన్‌ఫ్రా కంపెనీకి చెందిన భారీ వాహనం ప్రసాద్‌ను ఢీకొంది.  ఆయన నడుం మీదకు టైర్లు వెళ్లాయి. దీంతో కొంతమంది బిగ్గరగా కేకలు వేయడంతో డ్రైవర్‌ వాహనాన్ని ఆపాడు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. గాయపడిన ప్రసాద్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కాగా, ఇటీవల ఈ కంపెనీకి చెందిన వాహనాలు అత్యంత వేగంగా వెళ్తున్నాయని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2020-03-02T10:07:17+05:30 IST