బ్యాటరీలు చోరీ చేస్తున్న ఆరుగురి అరెస్టు
ABN , First Publish Date - 2020-11-14T05:24:52+05:30 IST
మండలంలో ట్రాక్టర్ బ్యాటరీలు, వ్యవసా య పంపుసెట్ ఇంజన్లు, డీజిల్ చోరీలకు పాల్పడుతు న్న ఆరుగురిని ఎచ్చెర్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
ఎచ్చెర్ల:మండలంలో ట్రాక్టర్ బ్యాటరీలు, వ్యవసా య పంపుసెట్ ఇంజన్లు, డీజిల్ చోరీలకు పాల్పడుతు న్న ఆరుగురిని ఎచ్చెర్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. లావేరు మండలం కేశవరాయుని పాలెం గ్రామానికి చెందిన దల్లి విశ్వేశ్వరరావు, కలిశెట్టి అప్పలనాయుడు, దల్లి చిన్నారావు, యడ్ల పీరునాయుడు, లోపెంటకు చెందిన జీరు ధనుంజయరావు, దాలి గోవింద లను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ జి.రాజేష్ తెలిపారు. వీరు వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన 7 బ్యాటరీలు, రెండు వ్యవసాయ పంపుసెట్ ఇంజన్లు, వంద లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అల్లినగరం జంక్షన్ వద్ద వీరిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.