ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

ABN , First Publish Date - 2020-12-06T05:24:38+05:30 IST

నవసమాజ నిర్మా ణానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పిలుపునిచ్చారు. జిల్లాలోని వార్డు, గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శుల తో తండ్యాంవలసలో శనివారం సమావేశం నిర్వ హించారు.

ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి : నవసమాజ నిర్మా ణానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పిలుపునిచ్చారు. జిల్లాలోని వార్డు, గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శుల తో  తండ్యాంవలసలో శనివారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నవ సమాజ స్థాపనలో మహిళా సంరక్షణ కార్యదర్శులే కీలకపాత్ర పోషించాలన్నారు. పోలీసు శాఖ, మహ ళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, చైల్డ్‌లైన్‌, పంచాయతీ తదితర విభాగాలకు సం ధానకర్తలుగా వ్యవహరించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విఠలేశ్వ రరావు, డీఎస్పీలు మహేంద్ర, శ్రీనివాసరావు, సీఐలు అంబేద్కర్‌, నీలయ్య, శ్రీనివాసరావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-06T05:24:38+05:30 IST