శనిత్రయోదశి సందర్భంగా.. తైలాభిషేకాలు నిర్వహించిన భక్తులు

ABN , First Publish Date - 2020-12-13T05:42:45+05:30 IST

శనిత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పోలాకి, దీర్ఘాశి, ఈదులవలస, సంతలక్ష్మీపురం, మబగాం, పిన్నింటిపేట, ప్రియాగ్రహారంలోని శనీశ్వరాలయాల్లో భక్తులు తైలాభిషేకాలు నిర్వహించారు.

శనిత్రయోదశి సందర్భంగా.. తైలాభిషేకాలు నిర్వహించిన భక్తులు

పోలాకి : శనిత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పోలాకి, దీర్ఘాశి, ఈదులవలస, సంతలక్ష్మీపురం, మబగాం, పిన్నింటిపేట, ప్రియాగ్రహారంలోని శనీశ్వరాలయాల్లో భక్తులు తైలాభిషేకాలు నిర్వహించారు. కిల్లిబుచ్చెన్నపేట వేంకటేశ్వర ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కిల్లి తేజోస్వామి, శ్రీరాములు ప్రత్యేక పూజలు చేయించారు. ఫ రేగిడి : మండలంలో సంకిలిశివాలయం ప్రాంగణంలో ఉన్న శనీశ్వర ఆలయం శనివా రం కిటకిట లాడింది. కార్తీకమాస శనిత్రయోదశ పర్వదినం కావటంతో ఈ ఆల యానికి భక్తులు పోటిత్తి దర్శించుకొన్నారు. నవగ్రహాలకు, శివపార్వతిలకు  అత్యంత భక్తిశ్రధ్దలతో స్దానికులు పూజలు నిర్వహించారు.Updated Date - 2020-12-13T05:42:45+05:30 IST