స్వీయ నియంత్రణ...కరోనాకు మందు

ABN , First Publish Date - 2020-03-21T09:42:33+05:30 IST

స్వీయ నియంత్రణతో కరోనా వైరస్‌ను నివారించవచ్చునని రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. స్థానిక సామాజిక ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం

స్వీయ నియంత్రణ...కరోనాకు మందు

 వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి 

 ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి

 రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ 


నరసన్నపేట, మార్చి 20:  స్వీయ నియంత్రణతో  కరోనా వైరస్‌ను నివారించవచ్చునని  రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.  స్థానిక సామాజిక ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ నివారణకు ప్రస్తుతం  మందులు అందుబాటులో లేని కారణంగా ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. జన సామూహాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.  ఇప్పటికే ప్రభుత్వం  విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు,   జిమ్స్‌, ఆలయాల మూసివేతకు ఆదేశించిందని వివరించారు.


జిల్లాలో కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామనీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనాను కట్టడి చేసేందుకు జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. కలెక్టర్‌  జిల్లా కన్వీనర్‌గా ఉంటారన్నారు.  ఇందులో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారన్నారు. వీరంతా నిరంతరం పర్యవేక్షణ చేస్తారన్నారు.  కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సూరపు కృష్ణారావు, వైద్యులు బలగ మురళీ, సుజాత, భార్గవనాయుడు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాస్క్‌ ధరించి ధరించి అవగాహన  కల్పించారు.

Updated Date - 2020-03-21T09:42:33+05:30 IST