మద్యం సీసాలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-09-12T11:25:02+05:30 IST

సంతకవిటి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన రాగోలు శ్రీరాములు నుంచి 12 మద్యం సీసాలను శుక్రవారం స్వాధీనం చేసుకు న్నట్లు హెచ్‌సీ చంద్రినాయుడు తెలిపారు. శ్రీరాములును డోలపేట కూడలి వద్ద పట్టుకున్న

మద్యం సీసాలు స్వాధీనం

రాజాం రూరల్‌: సంతకవిటి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన రాగోలు శ్రీరాములు నుంచి 12 మద్యం సీసాలను శుక్రవారం స్వాధీనం చేసుకు న్నట్లు హెచ్‌సీ చంద్రినాయుడు తెలిపారు. శ్రీరాములును డోలపేట కూడలి వద్ద పట్టుకున్నట్లు చెప్పారు. ఎస్‌ఐ రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు.  పాతపట్నం: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఆమదాలవలసకు చెందిన పొ ట్నూరు రాజశేఖర్‌ నుంచి ఐదు ఒడిశా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు  ఎస్‌ఐ టి.రాజేష్‌ తెలిపారు. 


రాజశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కోటబొమ్మాళి: కోటబొమ్మాళిలో ఒడిశాకు చెందిన ఇద్దరి నుంచి 81 మద్యం సీసాలు, సీతన్న పేట వద్ద బడే నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి 12 మద్యం సీసాలు శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ మన్మథరావు  తె లిపారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 23వరకు రిమాండ్‌ విధించినట్లు చెప్పారు. ఈదాడుల్లో ఎస్‌ఐ డి.ప్రభాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు. కవిటి: ఒడిశా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 576 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ట్లు ఎస్‌ఐ వాసునారాయణ తెలిపారు.


ఈ మేరకు కవిటికి చెందిన నాగుల ఖెత్రొబాసి, దవల భగీరథ బెహరాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


వజ్రపుకొత్తూరు: బొడ్డపాడు జంక్షన్‌ వద్ద 15 లీటర్ల సారాతో అక్కుపల్లికి చెందిన పొట్టి కిశోర్‌ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్సు మెంట్‌ బ్యూరో సీఐ బీవీ మురళీధర్‌ తెలిపారు. కిశోర్‌ను పలాస కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు చెప్పారు. ఈ దాడిలో ఎక్సైజ్‌  ఎస్‌ఐ జె.సంధ్యారాణి, యు.యోగేశ్వరరావు, ఆర్‌.సోమనాథం, దశరథ, హైమావతి, నాగేంద్రబాబు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-12T11:25:02+05:30 IST