సమస్యల పరిష్కారానికే సచివాలయ వ్యవస్థ

ABN , First Publish Date - 2020-11-13T05:45:22+05:30 IST

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

సమస్యల పరిష్కారానికే సచివాలయ వ్యవస్థ
మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం


  స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఆమదాలవలస రూరల్‌: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. మండలంలోని బొబ్బిలిపేటలో రూ.6లక్షలతో సీసీ రోడ్లు, రూ.17లక్షల 50వేలతో వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రం, తురకపేటలో రూ.21లక్షల 80వేలతో రైతుభరోసా కేంద్రం, నెల్లిపర్తిలో రూ.17లక్షల50వేలతో వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాల పనుల ప్రారంభానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జలకళ, చేయూత, వైఎస్సార్‌ ఆసరా, అమ్మఒడి, రైతుభరోసా వంటి పథకాల అమలుతో జగన్మోహన్‌రెడ్డి పాలనపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, బొడ్డేపల్లి నారాయణరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, గురుగుబెల్లి చలపతిరావు, మానుకొండ వెంకటరమణ, మామిడి ఢిల్లేశ్వరరావు, సైలాడ దాసునాయుడు, మొండేటి కూర్మారావు పాల్గొన్నారు.


బొబ్బిలిపేట పాఠశాలలో  ఎస్‌ఎంసీ కమిటీ ఏర్పాటు చేయాలి

బొబ్బిలిపేట గ్రామంలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఏర్పాటులో జాప్యంపై స్పీకర్‌ మండిపడ్డారు. రాజకీయాలు గ్రామాల్లోనే కానీ, పాఠశాలలపై కాదని ఎంపీడీవో పేడాడ వెంకటరాజుకు ఆదేశించారు. దీనిపై స్థానిక ఎంఈవోతో ఫోన్‌లో ఆయన మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2020-11-13T05:45:22+05:30 IST