గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2020-11-22T05:17:43+05:30 IST

నగర పాలక సంస్థ పరి ధిలోని సీపన్నాయుడుపేట వార్డు సచివాలయ అడ్మిన్‌ సెక్రటరీ సీపాన సత్యనారాయణ శనివారం గుండెపో టుతో మృతి చెందారు. సత్యనారాయణది సంతకవిటి మండలం గెడ్డవలస అగ్రహారం. గతేడాది సచివాలయ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: నగర పాలక సంస్థ పరి ధిలోని సీపన్నాయుడుపేట వార్డు సచివాలయ అడ్మిన్‌ సెక్రటరీ సీపాన సత్యనారాయణ శనివారం గుండెపో టుతో మృతి చెందారు. సత్యనారాయణది సంతకవిటి మండలం గెడ్డవలస అగ్రహారం. గతేడాది సచివాలయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. భార్య రేవతి, ఏడాది కు మారుడితో కలసి సీపన్నాయుడుపేటలో ఓ అద్దె ఇంటిలో నివాసముంటున్నారు. బాబుతో ఇంట్లో ఆడుకుంటుండగా సత్యనారాయణ గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ నల్లనయ్య, సచివాలయ ఉద్యో గులు సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.  

Read more