రెండోరోజూ ఐటీ దాడులు

ABN , First Publish Date - 2020-02-08T09:52:23+05:30 IST

రాజాంలోని రమేష్‌నాయుడు జ్యూయలర్స్‌లో శుక్రవారం కూడా ఆదాయపుపన్ను శాఖ అధికారులు

రెండోరోజూ ఐటీ దాడులు

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 7:  రాజాంలోని రమేష్‌నాయుడు  జ్యూయలర్స్‌లో శుక్రవారం కూడా ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగించారు. ఈనెల 6న (గురువారం) అర్ధరాత్రి వరకూ దాడులు చేసిన విషయం పాఠకులకు విధితమే. శుక్రవారం ఉదయం నుంచి జ్యూయలర్స్‌ యజమాని షాపు తెరవలేదు. అయితే... మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సుమారు పదిమంది అధికారులు వచ్చి యజమాని పిన్నింటి రమేష్‌ నాయుడు సమక్షంలో షాపు తెరిపించారు. షాపులోని రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. కంప్యూటర్లను పరిశీలించారు. అమ్మకాల మేరకు ఆదాయపుపన్ను శాఖకు చెల్లింపులు జరుగుతున్నాయా లేదా... జీఎస్టీ చెల్లింపులు, ఆన్‌లైన్‌లో బంగారం అమ్మకాలు తదితర అంశాలపై యజమాని నుంచి సమాచారాన్ని సేకరించినట్లు స్పష్టమవుతోంది. అయితే... షాపులో గురువారం డిస్‌ప్లే చేసిన బంగారు ఆభరణాలు శుక్రవారం కనిపించలేదు. రికార్డుల తనిఖీలు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2020-02-08T09:52:23+05:30 IST