మూడు నెలలుగా వేతనాల్లేవు..

ABN , First Publish Date - 2020-05-13T10:57:49+05:30 IST

కరోనా సమయంలో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మి కులు దేవుళ్లు.. వారిని ఆదరించాలి..

మూడు నెలలుగా వేతనాల్లేవు..

ఇబ్బందులు పడుతున్న పారిశుధ్య కార్మికులు

కరోనా సమయంలో సేవలు

వలంటీర్లు, సచివాలయ సిబ్బందిదీ అదే పరిస్థితి


టెక్కలి, మే 12: కరోనా సమయంలో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మి కులు దేవుళ్లు.. వారిని ఆదరించాలి.. ఇది ప్రధాని నుంచి అందరూ చెబుతున్న మాటలు.. అయితే క్షేత్రస్థాయిలో తమ ఆరోగ్యాన్ని పణం గా పెట్టి అత్యవసర సమయంలో సేవలందిస్తున్నా మమ్మల్ని అధికారులు పట్టించుకోవడం లేదని పారిశుధ్య కార్మికులు వాపోతున్నారు. టెక్కలి మేజర్‌ పంచాయతీలో సుమా రు 3 నెలలుగా వేతనాలు అందక వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తాము కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. దాతలు ఇచ్చిన నిత్యావసర వస్తువులతో బతకాల్సిన పరిస్థితి ఎదురవు తోం దని వారి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అలాగే 168 మంది వలం టీర్లకు, 40 మంది గ్రామ సచివాలయ సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు. 


సమస్య ఇదీ...

గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన చమళ్ల మధు నర్సింగపల్లికి బదిలీ కావడంతో చెల్లింపులకు సమస్య ఏర్పడింది. ఇటీవల వ్యవసాయశాఖ నుంచి డెప్యుటేషన్‌పై పంచాయతీ కార్యదర్శిగా శాంతిస్వరూప్‌ రాగా ఆయ నకు జీత భత్యాలు చెల్లించేందుకు అవకాశం లేకపోవడంతో సమస్య పరి ష్కారం కాకపోవడంతో వారంతా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ సమ స్యపై జిల్లా పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించక పోవ డంపై విమర్శలొస్తున్నాయి. ఈ విషయమై పంచాయతీ ప్రత్యేకాధికారి పి.నారాయణమూర్తి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ నెంబర్‌ జాప్యంతో చెల్లింపులు నిలిచాయని, త్వరలో తగు చర్యలు తీసుకుం టామని వివరణ ఇచ్చారు. 

Read more