-
-
Home » Andhra Pradesh » Srikakulam » salons
-
సెలూన్లు తెరిచేందుకు అనుమతివ్వరూ!
ABN , First Publish Date - 2020-05-13T11:05:58+05:30 IST
సెలూన్ల షాపులను తెరచుకునేందుకు తమకు అనుమతించాలని చింతామణి నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో

కవిటి: సెలూన్ల షాపులను తెరచుకునేందుకు తమకు అనుమతించాలని చింతామణి నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణులు టి.ప్రభాకర్, కె.ఆనంద్, లావణ్య, జానకిరావు, వెంకటరావు తహసీల్దార్ వి.విజయ్‌కుమారకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. లాక్‌డౌన్ వల్ల రెండునెలలుగా షాపులు తీయకపోవడంతో ఆదాయం లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. పనిలేక నిత్యావసర సరుకులు కూడా కొనలేని స్థితిలో ఉన్నామని వాపోయారు.
పాలకొండ (బూర్జ): లాక్‌డౌతో 50 రోజులుగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆ సంఘ నాయకులు కోరారు. మంగళవారం బూర్జ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.కార్యక్రమంలో సంఘ మండలాధ్యక్షుడు కె.జగదీష్, కార్యదర్శి బి.శ్రీనివాసరావు, సంఘ సభ్యులు సత్యనారాయణ, ఎ.కృష్ణ, యు.రామారావు, డి.శ్రీరాములు, కె.శ్రీను, నంది, సీతారాము, యేసు పాల్గొన్నారు.