ప్రజల ఆశయం మేరకు పాలన

ABN , First Publish Date - 2020-11-08T04:57:50+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తరువాత ప్రజల ఆశయం మేరకు పాలన సాగిస్తున్నట్లు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌లు తెలిపారు.

ప్రజల ఆశయం మేరకు పాలన
పాదయాత్ర చేస్తున్న ఎంపీ బెల్లాన, ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌


  విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌

ఎచ్చెర్ల: రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తరువాత ప్రజల ఆశయం మేరకు పాలన సాగిస్తున్నట్లు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌లు తెలిపారు. ఎచ్చెర్లలో శనివారం వారు పాదయాత్ర నిర్వ హించారు. ముందుగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చినరావుపల్లి, బలిజిపేట మీదుగా ఎస్‌ఎస్‌ఆర్‌పురం వరకు పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో నాయకులు పిన్నింటి సాయికుమార్‌, సనపల నారాయణరావు, బల్లాడ జనార్దనరెడ్డి, జరుగుళ్ల శంకరరావు, మాడుగుల మురళీధర్‌బాబా, నక్క కృష్ణమూర్తి, మొదలవలస చిరంజీవి, జీరు రామారావు, దుంప చిన్నారెడ్డి, డొంక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

 హామీలు నెరవేర్చిన ఘనత జగన్‌దే 

ఆమదాలవలస రూరల్‌: మేనిపేస్టోలో హమీలను శాతశాతం నేరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిదేని వైసీపీ  రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్‌ తెలిపారు. ప్రజా సంకల్పయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శనివారం సంఘీభావ యాత్ర జోన్నవలస నుంచి సైలాడ, కుమ్మరిపేట, చిట్టివలస మీదుగా రామచంద్రాపురం వరకు సాగింది. యాత్రలో తమ్మినేని శ్రీరామ్మూర్తి, బెండి గొవిందరావు, గొంటి కృష్ణ, సైలాడ దాసునాయుడు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, గురుగుబెల్లి చలపతిరావు, నక్కా కన్న బాబు, సోమయాజుల జగన్నాఽథం, చల్లా సింహచలం, శ్రీనివాసరావు   పాల్గొన్నారు

త్వరలో జంపరకోట పనులు పూర్తి

పాలకొండ(వీరఘట్టం):తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణకు, జంపరకోట రిజర్వాయర్‌కు రూ.200 కోట్లు కేటాయించడంతో త్వరలోనే పనులు పూర్తవుతాయని   ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌ తెలిపారు.శనివారం వీరఘట్టం మండలంలోని తెట్టంగి, నీలానగరం, కుమ్మరిగుంట, మెట్టవెంకటాపురం, పనసనందివాడ, తలవరంల్లో ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు.


Updated Date - 2020-11-08T04:57:50+05:30 IST