రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా

ABN , First Publish Date - 2020-12-14T05:09:23+05:30 IST

వజ్రపుకొత్తూరుకు చెందిన జవాన్‌ బొంగు బాబూ రావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. అసోం రైఫిల్‌లో జవాన్‌గా పనిచేసిన ఆయన అరుణాచల్‌ప్రదేశ్‌లో తీవ్రవాదులతో పోరాడి అక్టోబరు 21న మృతిచెందిన విషయం విదితమే. జిల్లా అధికారుల నుంచి సమాచారం అందిందని, రెండు రోజుల్లో మంత్రి అప్పలరాజు రూ.50 లక్షల చెక్కు అందజేయనున్నట్లు సమాచారం వచ్చిం దని బాబూరావు భార్య ప్రియ, తల్లి దమయంతి తెలిపారు.

రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా
మాట్లాడుతున్న బాబూరావు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు


  వీరజవాన్‌ కుటుంబానికి సమాచారం అందించిన అధికారులు

వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరుకు చెందిన జవాన్‌ బొంగు బాబూరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. అసోం రైఫిల్‌లో జవాన్‌గా పనిచేసిన ఆయన అరుణాచల్‌ప్రదేశ్‌లో తీవ్రవాదులతో పోరాడి అక్టోబరు 21న మృతిచెందిన విషయం విదితమే. జిల్లా అధికారుల నుంచి సమాచారం అందిందని,  రెండు రోజుల్లో మంత్రి అప్పలరాజు రూ.50 లక్షల చెక్కు అందజేయనున్నట్లు సమాచారం వచ్చిం దని బాబూరావు భార్య ప్రియ, తల్లి దమయంతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్థులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయడంలో మంత్రి అప్పల రాజు కృషి మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, మంత్రి అప్పలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పి.గురయ్య నాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు హేమంతరాజు, పి.లక్ష్మణ పాల్గొన్నారు.

 


 

Updated Date - 2020-12-14T05:09:23+05:30 IST