రోడ్లు ఇలా.. ప్రయాణం ఎలా?

ABN , First Publish Date - 2020-09-09T09:56:59+05:30 IST

ఈ ఫొటో చూశారా... ఓఏ అగ్రహారం నుంచి మెయిన్‌ రోడ్డు జంక్షన్‌కు వెళ్లే రహదారి పరిస్థితి ఇది. ఇలాంటి దుస్థితి మండలంలోని ఎన్నో గ్రామాల్లో కని

రోడ్లు ఇలా.. ప్రయాణం ఎలా?

అభివృద్ధికి నోచుకోని అంతర్గత రహదారులు

అవస్థలు పడుతున్న పల్లె ప్రజలు


(ఎచ్చెర్ల):

ఈ ఫొటో చూశారా... ఓఏ అగ్రహారం నుంచి మెయిన్‌ రోడ్డు జంక్షన్‌కు వెళ్లే రహదారి పరిస్థితి ఇది. ఇలాంటి దుస్థితి మండలంలోని ఎన్నో గ్రామాల్లో కనిపిస్తుంది. గ్రామాలను కలుపుతూ అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మరిన్ని కష్టాలు పడుతున్నారు.


వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే సంఘటనలు మండలంలో చాలా గ్రామాల్లో కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ఎచ్చెర్ల మండంలో అభివృద్ధికి నోచుకోని ఎన్నో రహదారులు ఇలా దర్శినమిస్తున్నాయి.


అభివృద్ధి చేయాల్సిన రోడ్లు ఇవీ...

ధర్మవరం నుంచి లావేటిపేట వయా రామజోగిపేట మీదుగా, ఓఏ అగ్రహారం నుంచి ధర్మవరం బీటీ రోడ్డు, చినకొంగరాం నుంచి కొంగరాం వరకు రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. చినకొంగరాం నుంచి ఏజీఎన్‌ పేట, ధర్మవరం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కొత్తదిబ్బలపాలెం, భగీరఽధపురం బీటీ రోడ్డు నుంచి కొయ్యాం, కేకే నాయుడుపేట ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి దారపువానిపేట, కుప్పిలి నుంచి సహపురం, ఎస్‌ఎస్‌ఆర్‌ పురం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి తంగివానిపేట, పొన్నాడ నుంచి తెప్పరేవు, కొయ్యాం నుంచి మూసవానిపేట, కుప్పిలి నుంచి యాతపేట వరకు రోడ్లను మెరుగుపర్చాల్సి ఉంది. 


పాడైన రోడ్లు

కొయ్యాం ఆర్‌అండ్‌బీ రోడ్డు సబ్‌స్టేషన్‌ నుంచి బడివానిపేట వరకు రోడ్డు పాడైంది. జాతీయ రహదారి నుంచి అరిణాం అక్కివలస, పూడివలస జంక్షన్‌ నుంచి ఇబ్రహింబాద్‌ రోడ్డు, తోటపాలెం జంక్షన్‌ నుంచి కొత్తపేట రోడ్డు పాడయ్యాయి. పొన్నాడ నుంచి బొంతలకోడూరు గ్రామానికి వెళ్లే రోడ్డు ప్రతిపాదన దశలో ఉంది. ఎచ్చెర్ల నుంచి తోటపాలెం వరకు ఆర్‌అండ్‌బీ రింగ్‌ రోడ్డు విస్తరణ పనుల యోచనలో ఉన్నారు.  


మంజూరైనా ముందుకు సాగనవి..

బొంతలకోడూరు నుంచి ధర్మవరం, ముద్దాడ నుంచి మాల అంబేడ్కర్‌ నగర్‌, కొత్తపేట నుంచి గాడుపేట మీదుగా కేశవరావుపేట జంక్షన్‌, తోటపాలెం నుంచి కొత్తపేట మీదుగా సెగిడిపేట, ధర్మవరం లావేటిపేట నుంచి కేకే నాయుడుపేట వరకు, జాతీయ రహదారి నుంచి ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్‌ రోడ్డు గతంలో మంజూరయ్యాయి. ఈ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. 


ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి..సీతన్నాయుడు, డీఈఈ 

 ప్రాధాన్యత క్రమంలో రోడ్డలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. 

Updated Date - 2020-09-09T09:56:59+05:30 IST