ఆర్జీయూకేటీ సెట్‌ రేపు

ABN , First Publish Date - 2020-11-27T04:56:50+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 28న పరీక్ష నిర్వహిస్తున్నట్టు శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.జగదీశ్వరరావు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

ఆర్జీయూకేటీ సెట్‌ రేపు
ప్రొఫెసర్‌ జగదీశ్వరరావు

- ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి 

-  డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జగదీశ్వరరావు 

ఎచ్చెర్ల, నవంబరు 26: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 28న పరీక్ష నిర్వహిస్తున్నట్టు శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.జగదీశ్వరరావు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ పరీక్ష ఫలితాలతోనే శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీలు, ఎన్జీరంగా వ్యవసాయ, శ్రీ వేంకటేశ్వర వె టర్నరీ, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీల పరిధిలో డిప్లమో కోర్సుల ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షకు హాజరు కావాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్‌ ఫోన్లు, చేతి గడియారం, కాలిక్యులేటర్‌ తదితర ఎలకా్ట్రనిక్‌ వస్తువులను తీసుకొని రాకూడదని తెలిపారు.  

 

Updated Date - 2020-11-27T04:56:50+05:30 IST