ఆక్రమణలు తొలగింపు
ABN , First Publish Date - 2020-11-13T05:43:24+05:30 IST
వంశధార రిజర్వా యర్ స్థలాల్లోని ఆక్ర మణలను సంబం ధిత అధికారులు గురువారం తొల గింపు చర్యలు చేప ట్టారు.
హిరమండలం : వంశధార రిజర్వా యర్ స్థలాల్లోని ఆక్ర మణలను సంబం ధిత అధికారులు గురువారం తొలగింపు చర్యలు చేప ట్టారు. కొంతమంది రిజర్వాయర్ స్థలాలను ఆక్రమించుకొని బడ్డీలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిని వెంటనే తొలగించాలని వంశధార ఈఈ ఆక్రమణదారులకు నోటీసులు అందజే శారు. రెండు రోజులైనా బడ్డీలు తొలగించకపోవడంతో ఈఈ సుశీల్ కుమార్, డీఈఈ బ్రహ్మానందం, తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తుతో జేసీబీతో తొలగించారు. బడ్డీలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ రిజర్వాయర్‌కు చెందిన స్థలాలను ఆక్రమణలకు పాల్పడితే ఇకపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.