జిల్లాలో తగ్గిన నేరాల సంఖ్య: ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-18T04:38:47+05:30 IST

జిల్లాలో నేరాల సం ఖ్య తగ్గుముఖం పట్టిందని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ తెలి పారు. గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో వార్షిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.

జిల్లాలో తగ్గిన నేరాల సంఖ్య: ఎస్పీ
సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌ బర్దర్‌

సంతకవిటి: జిల్లాలో నేరాల సం ఖ్య తగ్గుముఖం పట్టిందని  ఎస్పీ అమిత్‌ బర్దర్‌ తెలి పారు. గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో వార్షిక తనిఖీ చేశారు.  రికార్డులను పరిశీలించారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని, అయినా అప్రమత్తంగా ఉన్నామన్నారు. అన్ని మండలాల్లో నిరంతరం నిఘాను ఏర్పాటు చేయడం తోపాటు ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ ముమ్మరం చేస్తున్నామన్నారు. యువత మత్తుకు బానిసలు కాకుండా చూడాలన్నారు. మాస్కులు ధరించకుండా వాహ నాలు నడిపినా, లైసెన్స్‌ లేకపోయినా అపరాధ రుసుం వసూలు చేస్తా మన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఆయనతోపాటు డీఎస్పీ శ్రీలేఖ, సీఐ నవీన్‌కుమార్‌, ఎస్‌ఐ రామారావు తదితరులు పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2020-12-18T04:38:47+05:30 IST