ఆధ్యాత్మిక కేంద్రంగా రాజపురం
ABN , First Publish Date - 2020-12-14T05:13:38+05:30 IST
ఆధ్యాత్మిక కేంద్రంగా రాజపురం

డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్
కవిటి: రాజపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారుచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ తెలిపారు. ఆదివారం రాజపురంలో రామాలయానికి ఆనుకొని ఉన్న మూడెకరాల స్థలం పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ స్పిర్చ్యువల్ కాంప్లెక్స్, వెంకటేశ్వరాలయాలను ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే బల్లిపుట్టుగలో బీమామిత్రలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీమామిత్రలకు విధుల్లోకి తీసుకొని నెలసరి జీతాలు అందించేందుకు చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు, ఏఎంసీ ఉపాధ్యక్షుడు రజనీకుమార్ దొళాయి, కె.ప్రకాష్ పాల్గొన్నారు.