అమెరికాలోని కమ్యూనిటీ కాలేజీకి రాజాం విద్యార్థినులు

ABN , First Publish Date - 2020-12-31T05:26:06+05:30 IST

అమెరికాలోని కమ్యూనిటీ కాలేజ్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమానికి జీఎమ్‌ఆర్‌వీఎఫ్‌ విద్యా సంస్థల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎంపికైనట్లు డైరెక్టర్‌ అవనీష్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అమెరికాలోని కమ్యూనిటీ కాలేజీకి రాజాం విద్యార్థినులు

ఏడాది పాటు విద్యకు మౌనిక, హేమశ్రీ ఎంపిక

రాజాం, డిసెంబరు 30: అమెరికాలోని కమ్యూనిటీ కాలేజ్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమానికి జీఎమ్‌ఆర్‌వీఎఫ్‌ విద్యా సంస్థల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎంపికైనట్లు డైరెక్టర్‌ అవనీష్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీసీఎస్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ సంవత్సరం చదువుతున్న బెహరా మౌనిక, సోపేటి హేమశ్రీ అమెరికా విదేశాంగశాఖ స్పాన్సర్‌ చేసే కమ్యూనిటీ కాలేజీ ఇని షియేటివ్‌ ప్రొగ్రాం కింద అమెరికాలో తమకు నచ్చిన కోర్సును అభ్యసించే అవకాశం పొందా రన్నారు. ఈ ఏడాది సీసీఐపీ లో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్‌ లో జరిగిన యూ ఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌లో ఎంపికయ్యా రని పేర్కొన్నారు. రాజాం మేదరవీధి మత్స్యకార కుటుంబానికి చెందిన బెహరా మౌనిక ‘గిఫ్టెడ్‌ చిల్డ్రన్‌’లో ఎంపి కై మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యను అభ్యసిస్తోందన్నారు. విజయ నగరం జి ల్లా తెర్లాం మండలం పెరుమాళికి చెందిన సోపేటి హేమశ్రీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన దని, ఆమె తండ్రి బ్యాంకులో మెసెం జరుగా పని చేస్తూ ఇంట్లో టైలరింగ్‌ పని కూడా చేస్తుంటారని  తెలిపారు. అమెరికాలో విద్యను అభ్యసించేందుకు తమ విద్యార్థినులు ఎంపికవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ వారిని అభినందించారు. 

Updated Date - 2020-12-31T05:26:06+05:30 IST