-
-
Home » Andhra Pradesh » Srikakulam » Quarry excavations should be prevented
-
క్వారీ తవ్వకాలను అడ్డుకోవాలి
ABN , First Publish Date - 2020-11-28T05:02:41+05:30 IST
పలాస-కాశీబుగ్గ పరిధి సూది కొండ పోరంబోకు ప్రాంతంలో క్వారీ తవ్వకాలను అడ్డుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష కోరారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష
పలాసరూరల్, నవంబరు 27: పలాస-కాశీబుగ్గ పరిధి సూది కొండ పోరంబోకు ప్రాంతంలో క్వారీ తవ్వకాలను అడ్డుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ మధుసూదనరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురు షోత్తపురం రెవెన్యూ పరిధిలో సూదికొండ ప్రాంతంలో క్వారీ తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. క్వారీ ప్రాంతం నుంచి 500 మీటర్ల వరకు ఎటువంటి స్థిర, ప్రభుత్వ నివాస ప్రాంతాలు, కట్టడాలు లేవని రెవెన్యూ, గనులు, భూగర్భశాఖాధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఆ ప్రాంతంలో 200 పడకల ఆసుపత్రి, 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ క్వారీకి అనుమతులు ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ను కలిసిన వారిలో మునిసిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావు, నాయకులు లొడగల కామేశ్, పీరుకట్ల విఠల్, గాలి కృష్ణారావు, కె.సత్యం ఉన్నారు.