ప్రజల భాగస్వామ్యమే కీలకం

ABN , First Publish Date - 2020-04-24T10:34:05+05:30 IST

కరోనా వైరస్‌ నివారణలో ప్రజల భాగస్వామ్యమే కీలకమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

ప్రజల భాగస్వామ్యమే కీలకం

స్పీకర్‌ తమ్మినేని సీతారాం


ఆమదాలవలస రూరల్‌, ఏప్రిల్‌23: కరోనా వైరస్‌ నివారణలో ప్రజల భాగస్వామ్యమే కీలకమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.  గురువారం మండలంలోని నెల్లిపర్తి, కొర్లకోట, వంజంగిల్లో కరోనా విధుల్లో   సేవలందిస్తున్న వలంటీర్లకు తమ్మినేని ఇందుమతి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ తమ్మినేని వాణి, తమ్మినేని చిరంజీవినాగ్‌, తమ్మినేని శ్రీరామ్మూర్తి, బెండి గోవిందరావు, తిర్లంగి రామారావు, సువ్వారి నేతాజీ  పాల్గొన్నారు. కొర్లకోటలో 1000 కుటుంబాలకు చిగురుపల్లి శ్యామలరావు నిత్యావసర సరుకులు భార్య  వనజాక్షి జ్ఞాపకార్థం పంపిణీ  చేశారు. పేద బ్రాహ్మణ కుటుంబాలకు కచ్చఫీ కళాక్షేత్రం  ప్రతినిధులు బంకుపల్లి శ్రీరామచంద్రమూర్తి, శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో సరుకులు అందజేశారు.

Updated Date - 2020-04-24T10:34:05+05:30 IST