రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ABN , First Publish Date - 2020-11-27T05:14:47+05:30 IST
రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆదేశించారు.గురువారం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఎంపీ బెల్లాన
రాజాం రూరల్: రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆదేశించారు.గురువారం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది మండలాల ప్రజలకు సామా జిక ఆసుపత్రిలో ఎటువంటి ఇబ్బందులు చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చడానికి తనవంతు కృషిచేస్తానన్నారు. వైద్యులు, సిబ్బంది సక్రమంగా పనిచేసి ఆసుపత్రికి గుర్తింపును తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే జోగులు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.6.80 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో అదనపు భవనం నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్ర శేఖర్నాయుడు, పట్టణ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, కరణం సుదర్శనరావు, వైద్యులు వేణుగోపాలరావు, కోటీశ్వరరావు కమిటీ సభ్యులు గోరంట్ల హనుమంతురావు, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు తెలుసుకున్నారు. సేవలు ఏవిధంగా అందుతున్నయో అడిగి తెలుసుకున్నారు. బాలింతలకు కిట్లు అందజేశారు.