ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ జగదీశ్వరరావు

ABN , First Publish Date - 2020-11-20T05:00:30+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనిర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ పి.జగదీశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ జగదీశ్వరరావు
ప్రొఫెసర్‌ జగదీశ్వరరావు

 ఎచ్చెర్ల, నవంబరు 19: రాజీవ్‌గాంధీ యూనిర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ పి.జగదీశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగదీశ్వ రరావు 1990లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో జియో ఇంజనీరింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. ప్రస్తుతం ఆ విభాగాధిపతిగా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా పని చేస్తున్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో సభ్యునిగా వ్యవహరిస్తున్నారు.  ఈ నెల 23 తర్వాత  శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.  ప్రస్తుతం ఇన్‌చార్జి డైరెక్టర్‌గా మెకానికల్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జి.భానుకిరణ్‌ వ్యవహరిస్తున్నారు. Updated Date - 2020-11-20T05:00:30+05:30 IST