ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2020-12-02T05:06:47+05:30 IST
ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిబంధనలు పాటించాల్సిందేనని డీఎంహెచ్‌వో చంద్రనాయక్ స్పష్టం చేశారు.

గుజరాతీపేట: ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిబంధనలు పాటించాల్సిందేనని డీఎంహెచ్‌వో చంద్రనాయక్ స్పష్టం చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో మం గళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రైవే టు, ప్రభుత్వ వైద్యులు సమష్టిగా పని చేశారని ప్రశంసించారు. దీనివల్ల ముఖ్యంగా జిల్లాలో కరోనా మరణాల సంఖ్య తగ్గిందన్నారు. సెకెండ్ వేవ్ రా కుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. త్వరలో కరోనా వ్యాక్సిన్ వస్తుందని, మొదటి విడతలో కరోనా వారియర్స్‌కు, రెండో విడ తలో వృద్ధులు, పదేళ్లలోపు వయసు పిల్లలకు వేస్తామన్నారు. మూడవ విడతలో అందరికీ వాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏ వైద్యం చేస్తున్నారు, ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు, వాటి ధరల వివరాలను డిస్‌ప్లే చేయాలన్నారు. కరోనా వంటి ఖరీదైన వైద్యంపై ప్రజలకు వివరంగా తెలియజే యాలన్నారు స్కానింగ్, కొత్త నర్సింగ్ హోమ్‌లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరని, పాత ఆసుపత్రులను కూడా ఆన్‌లైన్ చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాథరావు పాల్గొన్నారు.