రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-06-06T09:53:11+05:30 IST

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌


రాజాం రూరల్‌, జూన్‌ 5: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని విజయనగరం ఎంపీ  బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పాలవలస పద్మావతితో పాటు డైరెక్టర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, కమిషనర్‌ నెల్లి రమేష్‌, వైసీపీ రాజాం టౌన్‌ కన్వీనర్‌ పాలవలస శ్రీనివాసరావు, పట్టణ, రూరల్‌ సీఐలు సోమశేఖర్‌, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


ఏడాదిలో ఎంతో అభివృద్ధి

ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టిన ఏడాదిలోనే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అమలు చేశారని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. ఏఎంసీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందించలమే లక్ష్యమన్నారు.

Updated Date - 2020-06-06T09:53:11+05:30 IST