-
-
Home » Andhra Pradesh » Srikakulam » Prices of vegetables
-
కొండెక్కిన కూరగాయల ధరలు
ABN , First Publish Date - 2020-03-24T07:37:33+05:30 IST
జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రభావంతో కూరగాయల ధరలకు అమాంతంగా రెక్కలు వచ్చాయి. ఈ నెల 31 వరకూ

నరసన్నపేట రూరల్, మార్చి 23: జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రభావంతో కూరగాయల ధరలకు అమాంతంగా రెక్కలు వచ్చాయి. ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కూర గాయల ధరలు ఒక్కసాగిగా రెట్టింపైనాయి. టామాటా రూ.40 నుంచి రూ.50, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు రూ.40కు విక్రయిస్తున్నారు. రెండు రోజులుగా వాహనాలు తిరగకపోవడంతో దాన్ని సాకుగా చూపించి అందుబాటులో ఉన్న అన్ని రకాల కూరగాయల ధరలను వ్యాపారులు రెట్టింపు చేశారు.