ప్రకాష్ మృతి తీరని లోటు
ABN , First Publish Date - 2020-09-14T09:20:16+05:30 IST
టీడీపీ సీనియర్ నేత, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తండ్రి బెం దాళం ప్రకాష్ ..
ఇచ్ఛాపురం/రూరల్/కంచిలి/ఆమదాలవలస/గుజరాతీపేట/ రాజాం: టీడీపీ సీనియర్ నేత, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తండ్రి బెం దాళం ప్రకాష్ మృతి పార్టీకి తీరని లోటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెం కటరావు అన్నారు. ప్రకాష్ ఆత్మకు శాంతి కలగాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రకాష్ వంటి మంచి మిత్రుడ్ని కోల్పోవడం బాధాకరమని మాజీ విప్ కూన రవికుమార్ అన్నారు. ప్రకాష్ మృతికి ఇచ్ఛాపురం మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సాడి సహదేవు రెడ్డి, టీడీపీ మండలాధ్యక్ష, కార్యదర్శులు డి.శ్రీనివాసు, డి.కామేశ్వరరావు, పార్టీ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కాళ్ల ధర్మారావు, నందకిజాని సంతాపం తెలిపారు. టీడీపీ పెద్ద దిక్కు కోల్పోయిందని కంచిలి మండలాధ్యక్షుడు బి.కురయ్య, కార్యదర్శి ఎం.రామారావు, నాయకులు బి.కామేషురెడ్డి, జగదీష్‌పట్నాయక్, ఎం.మార్కండేయులు, మురళీపట్నాయక్, ఎం.కేశవయ్య, పి.సూర్యనారాయణ, పి.పురుషోత్తంరెడ్డి తెలిపారు.