తీరంపై పోలీసుల ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-12-20T07:09:56+05:30 IST

మత్స్యకారుల మధ్య వలల వినియోగం విషయంలో ఏర్పడిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

తీరంపై పోలీసుల ప్రత్యేక దృష్టి
రబ్బర్‌ బుల్లెట్ల ప్రయోగంపై డెమో ఇస్తున్న సీఐ ఫిరోజ్‌

చీరాల, డిసెంబరు 19 : మత్స్యకారుల మధ్య వలల వినియోగం విషయంలో ఏర్పడిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంత గ్రామాలైన చీరాల మండలం వాడరేవు, వేటపాలెం మండలం కఠారివారిపాలెం, రామాపురం గ్రామాల్లో పికెట్లు కొనసాగిస్తున్నారు. మరోసారి అల్లర్లు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయా గ్రామాల్లో శనివారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. వజ్ర వాహనం ద్వారా వంద అడుగుల దూరంలో ఉన్న వారిపై భాష్పవాయువు, రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించే డెమో నిర్వహించారు. 


Updated Date - 2020-12-20T07:09:56+05:30 IST