‘నిబంధనలకు విరుద్ధంగా క్వారీలకు అనుమతులు’

ABN , First Publish Date - 2020-11-14T05:26:01+05:30 IST

నందిగాం మండలం గొల్లూరు పంచాయతీ సొంటినూరు పరిధిలో గ్రానైట్‌ క్వారీలకు అనుమతులివ్వడం నిబంధనలకు విరుద్ధమని పర్యావరణ పరిరక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు అన్నారు.

‘నిబంధనలకు విరుద్ధంగా క్వారీలకు అనుమతులు’

నందిగాం, నవంబరు 13: నందిగాం మండలం గొల్లూరు పంచాయతీ సొంటినూరు పరిధిలో గ్రానైట్‌ క్వారీలకు అనుమతులివ్వడం నిబంధనలకు విరుద్ధమని పర్యావరణ పరిరక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు అన్నారు. శుక్రవారం సొంటినూరు గ్రామాన్ని ఏడుగురు సభ్యుల బృందం పరిశీలించింది. గతంలో పెనాల్టీ విధించగా దాన్ని ఇటు ప్రభుత్వానికి, అటు గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు చెల్లించిన తరువాత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉండగా అధి కారులు దానికి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. గతనెల 21న కొవిడ్‌ నిబంధనలు ఉండగా ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. గ్రానైట్‌ తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతినడ మే కాకుండా భూగర్భ, జలసంపద క్షీణించడం ద్వారా నేల బావులు, బోరు బావుల్లో నీరు తగ్గి గిరిజనులు ఇబ్బం దులు ఎదుర్కొనే అవకాశం ఉందని వాపోయారు. తక్షణం అనుమతులను నిలిపివేసి అందరితో ప్రజాభిప్రాయం చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  ఆయనతో పాటు తోట వెహనరావు, తెప్పల బాలరాజు, లిబరేషన్‌ పార్టీ ప్రతినిధి పోతనపల్లి కామేశ్వరరావు, బొడ్డు వాసుదేవరావు, కోళ్ల పాపారావు  ఉన్నారు.

Updated Date - 2020-11-14T05:26:01+05:30 IST