తితలీ పరిహారం చెల్లించండి

ABN , First Publish Date - 2020-12-25T05:56:27+05:30 IST

అధికారంలోకి వస్తే పరిహారం రెట్టింపు చేస్తామని చెప్పి, ఆ విషయాన్నే మరిచిపోవడం అన్యాయమని జనసేన పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు అన్నారు.

తితలీ పరిహారం చెల్లించండి
ఎండలో దీక్ష చేస్తున్న జనసైనికులు

సోంపేట: అధికారంలోకి వస్తే పరిహారం రెట్టింపు చేస్తామని చెప్పి,  ఆ విషయాన్నే మరిచిపోవడం అన్యాయమని జనసేన పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు అన్నారు. తితలీ పరిహారం చెల్లించాలంటూ సోంపేటలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీజేపీ యువమోర్చ జిల్లా అధ్యక్షుడు బీన వంశీ సంఘీభావం తెలిపాడు. ఈదీక్షలో వూనా పాండురంగారావు, కె.రవి, ఎల్‌.శైలజ, ప్రదీప్‌, సంతోష్‌ పాల్గొన్నారు. అయితే దీక్ష శిబిరంలోని టెంటను తొలగించినప్పటికీ ఎండలోనే దీక్షను కొనసాగించారు. 

 

Updated Date - 2020-12-25T05:56:27+05:30 IST