‘మా నాన్న ఆచూకీ చెప్పండి’

ABN , First Publish Date - 2020-08-11T10:05:56+05:30 IST

కొవిడ్‌ లక్షణాలతో జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరి ధిలోని పురుషోత్తపురానికి చెం దిన పైల గురవ య్య ..

‘మా నాన్న ఆచూకీ చెప్పండి’

ఇచ్ఛాపురం, ఆగస్టు 10 :  కొవిడ్‌ లక్షణాలతో జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరి ధిలోని పురుషోత్తపురానికి చెం దిన పైల గురవ య్య  ఆచూకీ చె ప్పాలని కుటుం బ సభ్యులు కోరారు.  ఈమేరకు సోమవారం డిప్యూటీ తహశీల్దార్‌ శంకరరావుకు వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గురవయ్య కుమారుడు బాలరాజు విలేకరులతో మాట్లాడారు.   జులై 8న మా నాన్నకు విరోచనాలు కావటంతో వలం టటీర్లకు తెలియజేస్తే.. కరోనా  అనుమానంతో మా నాన్నతో పాటు అమ్మ నరసమ్మను కూడా అంబులెన్స్‌లో శ్రీకాకుళం తరలించారన్నారు. 


జెమ్స్‌ నుంచి మా అమ్మను రెండు రోజుల్లోనే ఇంటికి పంపించి... మా నాన్న గురవయ్యను రి మ్స్‌కు తరలించారని చెప్పారు. చాలా రోజులు నుంచి  మానాన్న నుంచి ఫోన్‌ రాక పోవటంతో ఈనెల 3న రిమ్స్‌కు వెళ్ల్లి అడిగామని అన్నారు. జులై 12న అ డ్మిట్‌ అయ్యారనీ..  రెండు రోజుల చికిత్స తర్వాత  కనిపించటం లేదని అక్కడ వైద్య సిబ్బంది  చెప్పార న్నారు. వెంటనే కలెక్టర్‌  కార్యాలయానికి సమాచారం ఇచ్చి శ్రీకాకుళం 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పాటు టోల్‌ఫ్రీ నెంబరును ఆశ్రయిం చామన్నారు. అయితే.. ఎవరూ స్పందించలేదని  ఆందోళన వెలిబుచ్చారు.  ఆయనతో పాటు  ఆర్‌ఐ కృష్ణప్రసాద్‌ రౌలో, వీఆర్‌వో రాజారెడ్డి,  కుటుంబ సభ్యులు చాట్ల తిరుపతి, ధర్మరాజు, భీమా, డిల్లీ, లోహిదాస్‌  ఉన్నారు. 

Updated Date - 2020-08-11T10:05:56+05:30 IST