నేటి నుంచి టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

ABN , First Publish Date - 2020-04-08T11:54:15+05:30 IST

పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలకు సన్నద్ధమయ్యేలా బుధవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్టు

నేటి నుంచి టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

గుజరాతీపేట, ఏప్రిల్‌ 7 : పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలకు సన్నద్ధమయ్యేలా బుధవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి కృత్తిక మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నిర్మూలనకు లాక్‌డౌన్‌ ప్రకటించిన కారణంగా పాఠశాలలకు సెలవులు ఇచ్చిన నేపఽథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్టు వివరించారు.


ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ, వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో దూరదర్శన్‌ - సప్తగిరి చానల్‌ ద్వారా పదోతరగతి విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనా కార్యక్రమాన్ని ఈనెల 8 నుంచి ప్రారంభిస్తారని  వివరించారు. ఉదయం 10 నుంచి 11, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో బోధనా కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపిక చేసిన రోజుల్లో ఫోన్‌-ఇన్‌ కార్యక్రమం ద్వారా నిపుణుల నుంచి విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొనే సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు.  

Updated Date - 2020-04-08T11:54:15+05:30 IST