నిత్యాన్నదానానికి లక్ష విరాళం

ABN , First Publish Date - 2020-03-15T10:46:07+05:30 IST

అరసవిల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి నరసన్నపేటకు చెందిన టి.శ్రీవెంకటేశ్వర్లు, కనకరత్నం దంపతులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. ఆలయ

నిత్యాన్నదానానికి లక్ష విరాళం

అరసవిల్లి, మార్చి 14: అరసవిల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి నరసన్నపేటకు చెందిన టి.శ్రీవెంకటేశ్వర్లు, కనకరత్నం దంపతులు రూ.లక్ష  విరాళంగా ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాష్‌ను వారు శనివారం కలుసుకుని, ఈ  నగదును అందజేశారు. ఈసందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతల దాతృత్వంతో ప్రతిరోజూ సూర్యదేవాలయంలో 400 నుంచి 600 మందికి, ఆదివారం వెయ్యి నుంచి 1,300 మంది భక్తులకు అన్నదానం చేస్తున్నామని చెప్పారు. అనంతరం దాతలకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఈవో అందజేశారు. 

Updated Date - 2020-03-15T10:46:07+05:30 IST