-
-
Home » Andhra Pradesh » Srikakulam » On reaching Kannavari house
-
కన్నవారి ఇంటికి చేరేలోగా...
ABN , First Publish Date - 2020-12-11T05:12:36+05:30 IST
కన్నవారి ఇంటికి భర్తతో కలిసి బయలుదేరిన ఓ వివాహితను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఇంకా కొద్దినిమిషాల్లో ఇంటికి చేరుతారన్న సమయంలో ద్విచక్రవాహనాన్ని లారీఢీకొనడంతో ఆమె మృతిచెం దింది.

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
కంచిలి: కన్నవారి ఇంటికి భర్తతో కలిసి బయలుదేరిన ఓ వివాహితను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఇంకా కొద్దినిమిషాల్లో ఇంటికి చేరుతారన్న సమయంలో ద్విచక్రవాహనాన్ని లారీఢీకొనడంతో ఆమె మృతిచెం దింది. పోలీసుల కథనం మేరకు... మండలంలోని జెన్నాగాయి గ్రామానికి చెందిన బొగియా పురుషోత్తం తన భార్య బొగియా రాధిక(24) కుమారుడితో కలిసి గురువారం కంచిలిలోని బీపీకాలనీలోని కన్నవారి ఇంటికి బయలుదేరారు. కంచిలి సమీపంలో పాతాలేశ్వరాలయం కూడలి వద్ద జాతీయరహదారిపైకి వస్తుండగా వెనుక వైపు నుంచి లారీ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో రాధిక రోడ్డుపై పడిపోవడంతో ఎడమతొడపై నుంచి లారీ వెళ్లిపోయింది.తీవ్రంగా గాయపడిన రాధికను సోంపేట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని బరంపురం తరలించగా అక్కడ చికిత్సపొందుతూ రాధిక మృతిచెందింది. భర్త పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
గుర్తు తెలియని వృద్ధుడు..
సీతంపేట: దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిదిలో సామరెల్లి గ్రామంలో గుర్తుతెలియని వృద్ధుడు గురు వారం మృతిచెందాడు. దోనుబాయి ఎస్‌ఐ రామ చం ద్రరావు కథనం మేరకు.... ఐదురోజులుగా భిక్షాటనచేసి జీవిస్తున్న వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయన్ను సీతంపేట ఆసుపత్రికి 108 వాహ నంలో తరలించారు. పరిస్థితి విషమంగా ఉండ డంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వృద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ గ్రామమో తెలియరాలేదు. మృత దేహం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉం దని, ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే గుర్తుపట్టాలని ఎస్‌ఐ తెలిపారు.
కొంగరాం మాజీ సర్పంచ్ మృతి
ఎచ్చెర్ల: కొంగరాం మాజీ సర్పంచ్ గోపిన రాంబాబు (73) బుధవారం రాత్రి మృతి చెందారు. రాంబాబు 1970 నుంచి 1995 వరకు సుమారు రెండున్నర దశాబ్దాల పాటు ఏకగ్రీవ సర్పంచ్‌గా వ్యవహరించారు. 2016లో కొంగరాం నీటి సంఘం అధ్యక్షుడిగా, పొన్నాడ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కొత్త వరి వంగడాలను సాగుచేస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో సచివాలయ నిర్మాణానికి పది సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రాంబాబు కుటుంబాన్ని గురువా రం టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, నాయకులు బీవీ రమణారెడ్డి, బెండు మల్లేశ్వరరావు, తదితరులు పరామర్శించారు.