అటవీ శాఖ వాహనాల వేలం ద్వారా రూ.15.56 లక్షలు ఆదాయం

ABN , First Publish Date - 2020-12-16T05:18:12+05:30 IST

ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడి సీజ్‌ చేసిన వాహనాలకు డివిజన్‌ ఫారెస్ట్‌ అధికారులు వేలంపాట నిర్వహించగా రూ.15.56 లక్షలు ఆదా యం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అటవీ శాఖ వాహనాల వేలం ద్వారా రూ.15.56 లక్షలు ఆదాయం

ప్రొద్దుటూరు అర్బన్‌, డిసెంబరు 15 : ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడి సీజ్‌ చేసిన వాహనాలకు డివిజన్‌ ఫారెస్ట్‌ అధికారులు  వేలంపాట నిర్వహించగా  రూ.15.56 లక్షలు ఆదా యం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు డివిజన్‌ ఫారెస్ట్‌ కార్యాలయంలో 52 వాహనాలకు వేలం పాటను నిర్వహించగా 50 వాహనాలను 23 మంది వ్యాపారులు 15.56 లక్షలకు కొనుగోలు చేశారని డీఎఫ్‌ఓ నాగార్జునరెడ్డి తెలిపారు. 10 ఏళ్ల క్రితం నుంచి వనిపెంట, బద్వేల్‌, పోరుమామిళ్ళ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో ఎర్రచందనం అక్రమరవాణాలో పట్టుబడ్డ 52 వాహనాలకు వేలం పాట నిర్వహించామన్నారు. ఎంవీఐ నిర్ణయించిన రేట్లకంటే ఎక్కువ ధరకు వ్యాపాలు కొనుగోలు చేశారన్నారు.  కడప డీఎఫ్‌ఓ గురు ప్రభాకర్‌, ప్రొద్దుటూరు, వనిపెంట, పోరుమామి ళ్ళ, బద్వేలు రేంజ్‌ ఆఫీసర్లు రవికుమార్‌,దినేష్‌ కుమార్‌రెడ్డి, తిరుమలేష్‌ రాజు, మధుబాబు, ఎంవీఐ రవీంద్రనాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:18:12+05:30 IST